‘స్పిరిట్’ మూవీపై కొత్త బజ్.. నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

‘స్పిరిట్’ మూవీపై కొత్త బజ్.. నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

Published on Jan 27, 2026 9:00 PM IST

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘ది రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’లో (Spirit)నటిస్తున్నాడు. ‘యానిమల్’ వంటి సంచలన విజయం తర్వాత సందీప్ వంగా రూపొందిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ 2026 జనవరి 31న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్యాటక ప్రాంతమైన ముస్సోరీలో ఈ కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. అయితే, ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనడం లేదని తెలుస్తోంది. కేవలం ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన సన్నివేశాలను మాత్రమే అక్కడ చిత్రీకరించనున్నట్లు సమాచారం.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ ఒబేరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు