విడుదల తేదీ : జనవరి 30, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, సురభి ప్రభావతి, రోహిణి నోని తదితరులు.
దర్శకుడు : ఏ.ఆర్. సజీవ్
నిర్మాతలు: సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ
సంగీతం : జే క్రిష్
ఛాయాగ్రహణం : దీపక్ యెరగరా
కూర్పు : ఏ.ఆర్. సజీవ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi) ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి
Om Shanti Shanti Shantihi కథ :
ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) ఒక కోపిష్టి మరియు అహంకారం కలిగిన వ్యక్తి. చేపల చెరువు బిజినెస్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జీవితంలో స్వేచ్ఛ లేని ప్రశాంతి (ఈషా రెబ్బా) తన కలలను పక్కనపెట్టి ఓంకర్ నాయుడుని పెళ్లి చేసుకుంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి ?, అసలు ఓంకార్ పెట్టే వేధింపులను, అతని పెత్తనాన్ని ప్రశాంతి ఎలా భరిస్తూ వచ్చింది ?, ఒకానొక దశలో ఆమె సహనం నశించి, తన భర్త అహంకారాన్ని ఆమె ఎలా అణిచి వేసింది ?, అతనికి ఎలా బుద్ధి చెప్పింది?, చివరకి వీరిద్దరి జీవితంలో ఏం జరిగిందనేది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
భార్యాభర్తల మధ్య గొడవలను వినోదాత్మకంగా ఈ చిత్రంలో చూపించారు. అన్యోన్యత లేని భార్యాభర్తల మధ్య డ్రామా బాగుంది. ముఖ్యంగా భర్త అహంకారాన్ని అణిచివేసే భార్య తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సీన్స్ బాగున్నాయి. ఈ మధ్యలో గర్బస్రావం, కథ విడాకుల వైపుకు టర్న్ అవ్వడం ఆకట్టుకుంది. వీటితో పాటు గోదావరి నేటివిటితో సాగే ఫ్యామిలీ డ్రామా, కొన్ని ఎమోషనల్ సీన్స్, ప్రధానంగా గోదావరి యాస, భాష ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. సినిమాలో భావోద్వేగాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి.తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు సగటు భర్త తాలూకు ఎలిమెంట్స్ ను కూడా బాగా పలికించాడు.
ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. తరుణ్ భాస్కర్ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ గా ఈషా రెబ్బా తన నటనతో అలరించింది. ఇక మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మాజీ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. మరో కీలక పాత్రలో కనిపించిన బ్రహ్మానందం నటన కూడా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన సురభి ప్రభావతి, రోహిణి నోని మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
తరుణ్ భాస్కర్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు, అంతే స్థాయిలో కథనాన్ని , ఆ కథనం గమనాన్ని జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే, కొన్ని కీలక సన్నివేశాలను ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలం అయ్యారు. మొత్తానికి సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది. మొత్తమ్మీద కథలో ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను కూడా కరెక్ట్ గా వాడుకోలేదు. దీంతో, సెకండ్ హాఫ్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ఏ.ఆర్. సజీవ్ తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు జే క్రిష్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘ఓం శాంతి శాంతి శాంతిః’’ (Om Shanti Shanti Shantihi) అంటూ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


