వెంకీ కోసం త్రివిక్రమ్ పాట్లు.. మార్పులు-చేర్పులతో బిజీ..!

వెంకీ కోసం త్రివిక్రమ్ పాట్లు.. మార్పులు-చేర్పులతో బిజీ..!

Published on Jan 30, 2026 12:01 AM IST

Aadarsha-Kutumbam-House

విక్టరీ వెంకటేష్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’(Aadarsha Kutumbam) అనే సినిమాను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను ఒక ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రాజెక్టులో వరుసగా టెక్నికల్ మార్పులు జరుగుతున్నాయి. తొలుత ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ నేతృత్వంలో వేసిన ఇంటి సెట్ త్రివిక్రమ్‌కు సంతృప్తినివ్వలేదట. దీంతో ఆయన స్థానంలో ప్రకాష్‌ను తీసుకొచ్చి కొత్తగా సెట్ వేయించి షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టారు. అంతకుముందు కెమెరామెన్ విషయంలోనూ ఇలాంటి మార్పే జరిగినట్లు సమాచారం.

సాంకేతిక నిపుణుల మార్పుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ కొంత ఆలస్యమవుతున్నప్పటికీ, నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు