ఓటీటీలోకి వచ్చేస్తున్న శివకార్తికేయన్ ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

ఓటీటీలోకి వచ్చేస్తున్న శివకార్తికేయన్ ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

Published on Jan 31, 2026 10:01 PM IST

Parasakhti

తమిళ హీరో శివకార్తికేయన్ లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ మూవీ ‘పరాశక్తి’(Parasakthi) సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ రిలీజ్ అయింది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ పొలిటికల్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి బజ్‌తో రిలీజ్ అయింది. అయితే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ మూవీ ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది.

శివకార్తికేయన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డా సినిమా మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న జీ5 ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా రవి మోహన్, అథర్వ, రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, ధనంజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు