మెగా అభిమానులందరికీ ఇది నిజంగా పండగ లాంటి వార్త! టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరియు ఉపాసన (Upasana) దంపతులు ఇప్పుడు కవల పిల్లలకు (Twins) తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఉపాసన ఒక పండంటి మగబిడ్డకు (Baby Boy) మరియు ఒక ఆడబిడ్డకు (Baby Girl) జన్మనిచ్చారు. ఈ “డబుల్ ధమాకా” న్యూస్ వినగానే మెగా ఫ్యామిలీలో మరియు ఫ్యాన్స్ మధ్య ఆనందం వెల్లివిరిసింది.
చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఈ గుడ్ న్యూస్ షేర్ చేస్తూ.. “ఎంతో సంతోషంతో మరియు కృతజ్ఞతా భావంతో ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాము. రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ (ఒక బాబు, ఒక పాప) పుట్టారు” అని పేర్కొన్నారు. అలాగే, తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం అంతా క్షేమమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తాతయ్యగా, నానమ్మగా ఈ చిన్నారులను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, ఇదొక దైవాశీర్వాదమని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అలాగే, తమ కుటుంబంపై ప్రేమను కురిపిస్తూ, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు క్లిన్ కారా (Klin Kaara) అనే పాప ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ట్విన్స్ రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ విషెస్ తో హోరెత్తిస్తున్నారు.


