ధురంధర్ ఓటీటీ : ఆ ఫిర్యాదుల తర్వాత జరిగిన మార్పులు ఇవే..!

ధురంధర్ ఓటీటీ : ఆ ఫిర్యాదుల తర్వాత జరిగిన మార్పులు ఇవే..!

Published on Feb 1, 2026 1:31 AM IST

Dhurandhar 2

బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘ధురంధర్'(Dhurandhar) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన మరుక్షణమే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణను పొందుతోంది. అయితే, థియేటర్లో చూసిన ప్రేక్షకులకు, ఓటీటీలో చూస్తున్న వారికి మధ్య విజువల్ క్వాలిటీ విషయంలో ఒక పెద్ద ఫిర్యాదు తలెత్తింది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా కలర్ గ్రేడింగ్ థియేట్రికల్ వెర్షన్ అంతగా లేదని చాలా మంది వీక్షకులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. విజువల్ క్వాలిటీలో ఆకస్మిక తగ్గుదల పట్ల సినీ ప్రియుల నుండి వచ్చిన ఫిర్యాదులపై చిత్రబృందం మరియు ఓటీటీ యాజమాన్యం తక్షణమే స్పందించాయి. ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ మేరకు అవసరమైన మార్పులు చేసి, మెరుగైన కలర్ గ్రేడింగ్‌తో కూడిన కొత్త వెర్షన్‌ను కేవలం కొన్ని గంటల్లోనే అప్‌లోడ్ చేయడం విశేషం.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఇలా వేగంగా స్పందించి మార్పులు చేయడం ఒక అరుదైన విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ డ్రామాలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్ మరియు అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం భారత్‌లోనే కాకుండా పలు ఇతర దేశాల్లో కూడా ట్రెండింగ్‌లో ఉండటంతో, రాబోయే రోజుల్లో ఓటీటీ వ్యూయర్‌షిప్ మరింత పెరిగే అవకాశం ఉంది.

తాజా వార్తలు