మెగా 158.. ఆ రూమర్స్ లో నిజం లేదా!?

మెగా 158.. ఆ రూమర్స్ లో నిజం లేదా!?

Published on Aug 4, 2026 8:00 AM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కొల్లి బాబీ కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. చిరు కెరీర్ 158వ సినిమాగా దీన్ని కన్ఫర్మ్ చేసి గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం షూట్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ స్పెక్యులేట్ అవుతుంది.

దీని ప్రకారం మెగాస్టార్ ఇందులో డ్యూయల్ రోల్ అది కూడా తండ్రీ కొడుకులు పాత్రలు చేస్తున్నారు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ లో కూడా మెగాస్టార్ ఈ తరహా రోల్స్ చేయడం లేదనే టాక్. సో ఇందులో నిజం లేదనే అనుకోవాలి. ఇక ఈ చిత్రంలో అనస్వర రంజన్ చిరు కూతురు పాత్రలో నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు