క్రేజీ బజ్.. నాని నెక్స్ట్ కోసం ‘ధురంధర్’సంగీత దర్శకుడు?

క్రేజీ బజ్.. నాని నెక్స్ట్ కోసం ‘ధురంధర్’సంగీత దర్శకుడు?

Published on Feb 1, 2026 11:59 PM IST

Nani

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రస్తుతం భారీ సినిమా ది ప్యారడైజ్ కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తో సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ ని అందుకుంది. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ సినిమా కోసం ప్రెజెంట్ సెన్సేషనల్ హిట్ ధురంధర్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్ దేవ్ వర్క్ చేయనున్నాడు అని రూమర్స్ మొదలయ్యాయి. ఇవాళ నాని పోస్ట్ లో కూడా ధురంధర్ ట్యూన్ తోనే పోస్ట్ చేయడంతో తన నెక్స్ట్ సినిమాకి అతడే అంటూ టాక్ మొదలైంది. కానీ ఇది దాదాపు సాధ్యం కాకపోవచ్చు అనే అనుకోవాలి. సుజిత్ సినిమాకి దాదాపు థమన్ తోనే వర్క్ ఉండొచ్చు. సో తను కాకుండా నిజంగానే ధురంధర్ సంగీత దర్శకునితోనే అంటే అది నెక్స్ట్ లెవెల్ స్టెప్ అనే చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.

తాజా వార్తలు