సౌత్ లో ‘టాక్సిక్’ ని ‘ధురంధర్ 2’ ఈజీగా డామినేట్ చేసే ఛాన్స్?

సౌత్ లో ‘టాక్సిక్’ ని ‘ధురంధర్ 2’ ఈజీగా డామినేట్ చేసే ఛాన్స్?

Published on Feb 2, 2026 7:00 AM IST

Dhurandhar 2 and Toxic

ఇప్పుడు మరోసారి ఇండియా వైడ్ గా బాలీవుడ్ చిత్రం ధురంధర్ కోసమే మాట్లాడుకుంటున్నారు. గత డిసెంబర్ లో విడుదల అయ్యిన ఈ సినిమా థియేటర్స్ లో పాన్ ఇండియా రిలీజ్ కాకుండానే రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాకుండా తెలుగు స్టేట్స్ లో సహా తమిళ్ లో కూడా ఈ సినిమా హిందీలోనే విడుదల అయ్యి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాకి పార్ట్ 2 గా వస్తున్న సినిమానే ధురంధర్ 2 (Dhurandhar 2). మార్చ్ 19న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే దీనికి పోటీ ఉన్న సినిమా రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్ ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కాంట్రవర్సీతో పాటు మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది.

కానీ ఇప్పుడు ధురంధర్ (Dhurandhar) ఓటీటీలో రిలీజ్ అయ్యాక సౌత్ ఆడియెన్స్ లో ధురంధర్ (Dhurandhar) హవా ఓ రేంజ్ లో కనిపిస్తుంది. దీనితో పార్ట్ 2 కోసం కూడా సౌత్ లో చర్చ మొదలైంది. ఈ గ్యాప్ ని మాత్రం టాక్సిక్ భర్తీ చేయలేకపోతుంది. సో ధురంధర్ సినిమాతో పోటీలో టాక్సిక్ ఉన్నప్పటికీ దక్షిణాదిన రణ్వీర్ సినిమాకే ఎడ్జ్ ఉన్నా ఎలాంటి ఆశ్చర్యం లేదనే భావించవచ్చు. సో రానున్న రోజుల్లో ఏ సినిమా డామినెన్స్ ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు