Border 2 Collections : దూసుకుపోతున్న ‘బోర్డర్ 2’.. ఏకంగా ఆ మార్క్‌ను టచ్ చేసిన కలెక్షన్స్

Border 2 Collections : దూసుకుపోతున్న ‘బోర్డర్ 2’.. ఏకంగా ఆ మార్క్‌ను టచ్ చేసిన కలెక్షన్స్

Published on Feb 2, 2026 1:03 PM IST

Border 2 Collections

బాలీవుడ్‌లో క్లాసిక్ చిత్రంగా నిలిచిన ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బోర్డర్ 2’ (Border 2) బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ వార్ డ్రామా, విడుదలైన 10వ రోజున ఒక కీలక మైలురాయిని చేరుకుంది. రెండో ఆదివారం నాటికి ఈ సినిమా ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటూ వసూళ్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

రెండో ఆదివారం రోజున ఏకంగా రూ. 24.22 కోట్ల నెట్ వసూళ్లను సాధించడంతో, ఈ చిత్రం భారత్‌లో రూ. 300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 301.89 కోట్లకు చేరుకున్నాయి. అయితే, అసలైన పరీక్ష సోమవారం నుండి ప్రారంభం కానుంది. వారాంతం తర్వాత వసూళ్లు తగ్గే అవకాశం ఉండటంతో, లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎలాంటి ఘనతలను సాధిస్తుందో వేచి చూడాలి.

ఇక ఇటీవల ఈ (Border 2) చిత్రానికి కొనసాగింపుగా ‘బార్డర్ 3’ని కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. టీ-సిరీస్ ఫిల్మ్స్ మరియు జెపి ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా తదితరులు నటించారు.

తాజా వార్తలు