సంక్రాంతి 2027 : బాక్సాఫీస్ దగ్గర సీనియర్ హీరోల వార్..!

సంక్రాంతి 2027 : బాక్సాఫీస్ దగ్గర సీనియర్ హీరోల వార్..!

Published on Feb 2, 2026 4:59 PM IST

Sankranthi 2027

సంక్రాంతి పండుగ సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలు పెద్ద సంఖ్యలో రిలీజ్ అవుతుంటాయి. పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు ప్రయత్నిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ దగ్గర పలు క్రేజీ చిత్రాలు రిలీజ్ అయ్యి హిట్లు అందుకున్నాయి. అయితే, 2027 సంక్రాంతి (Sankranthi 2027) కోసం ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు కొందరు హీరోలు.

2027 సంక్రాంతి బరిలో ఎలాగైనా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన నెక్స్ట్ చిత్రాన్ని స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో చేయనున్నాడు. ఇక ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు.

నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి హీరో అనే ట్యాగ్ ఉంది. ఆయనకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొస్తుంది. దీంతో ఆయన కూడా తన నెక్స్ట్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి (Sankranthi 2027) తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోయే సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కూడా తన నెక్స్ట్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బాబీతో ఆయన చేయబోయే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లోని ల్యాండ్‌మార్క్ 100వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రా కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కూడా సంక్రాంతి 2027కి (Sankranthi 2027) వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇలా టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరూ తమ సినిమాలను సంక్రాంతి 2027కి (Sankranthi 2027) తీసుకురావాలని భావిస్తుండటంతో వచ్చే పండుగ సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి వీరిలో ఏ హీరో సంక్రాంతికి వస్తారో, ఎవరు తమ సినిమాలను పండుగ బరిలో రిలీజ్ చేస్తారో చూడాలి.

తాజా వార్తలు