న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ‘దసరా’. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ‘ది ప్యారడైజ్’ అనే మూవీ రాబోతుంది. ఐతే, ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. కాగా మోహన్ బాబు పాత్ర పై ఓ లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. నానికి పెంపుడు తండ్రి పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నాడట. కానీ, ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించడం లేదు అని తెలుస్తోంది.
అన్నట్టు ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి.పైగా నాని ఇప్పటివరకు కనిపించని విభిన్న లుక్‌లో దర్శనమిచ్చాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


