‘పెద్ది’ కొత్త డేట్ ఇచ్చేశాడు.. మరి ‘ది ప్యారడైజ్’ సంగతేమిటి..?

‘పెద్ది’ కొత్త డేట్ ఇచ్చేశాడు.. మరి ‘ది ప్యారడైజ్’ సంగతేమిటి..?

Published on Feb 5, 2026 10:03 AM IST

Peddi

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’, న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే, ఈ రెండు చిత్రాలు కూడా తొలుత బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నట్లు తమ రిలీజ్ డేట్లను ప్రకటించాయి. ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని మార్చి 26న, ‘పెద్ది’ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు.

కానీ, ఈ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ డేట్స్‌ను మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఏప్రిల్ 30 కోసం ఆసక్తిగా చూస్తున్నారు. కానీ, నాని ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

దీంతో నాని అండ్ టీమ్ తమ సినిమా రిలీజ్ డేట్ విషయంలో తొందరపడొద్దని భావిస్తున్నారట. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఈ చిత్రం వేసవి తర్వాత వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి తొందరపాటు చేయడం లేదట మేకర్స్. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు