‘మన శంకర వరప్రసాద్ గారు’ 25 డేస్ కలెక్షన్స్.. చిరు స్టామినాకు పర్ఫెక్ట్ నిదర్శనం!

‘మన శంకర వరప్రసాద్ గారు’ 25 డేస్ కలెక్షన్స్.. చిరు స్టామినాకు పర్ఫెక్ట్ నిదర్శనం!

Published on Feb 5, 2026 1:07 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతి కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వింటేజ్ మ్యానరిజంతో మెగాస్టార్ అందించిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా పండుగ సీజన్ తర్వాత కూడా స్టడీగా రన్ అవుతూ చిరు స్టామినాకు ఉదాహరణగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం 25 డేస్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ.375 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు