మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతి కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వింటేజ్ మ్యానరిజంతో మెగాస్టార్ అందించిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా పండుగ సీజన్ తర్వాత కూడా స్టడీగా రన్ అవుతూ చిరు స్టామినాకు ఉదాహరణగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం 25 డేస్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ.375 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.
₹375Crores+ Gross & counting for the ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #MSG ❤️🔥❤️🔥❤️🔥
With immense love from audiences across the globe, it's 25 GLORIOUS DAYS at the box office for #ManaShankaraVaraPrasadGaru 🔥
Book your tickets now and experience the blockbuster magic in… pic.twitter.com/Wlhqc77H3B
— Shine Screens (@Shine_Screens) February 5, 2026


