మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 11, 2026 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఏకంగా రూ.375 కోట్లు వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఓటిటి వెర్షన్‌లో ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ సినిమా నిడివి కోసం థియేటర్లలో కట్ చేసిన కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు ఓటిటి లో యాడ్ చేశారట. ముఖ్యంగా వీటీవీ గణేష్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించనున్నాయట. చిరంజీవి మార్క్ యాక్షన్, వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకు కలిసొచ్చిన అంశాలుగా నిలిచాయి.
భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, బాక్సాఫీస్ వద్ద 25 రోజుల పాటు విజయవంతంగా ఆడిన ఈ చిత్రం భారీ డీల్ కారణంగా త్వరగా ఓటీటీలోకి వస్తోంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఫిబ్రవరి 11 నుంచి తమ ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చు.


