ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఇండియాలో బిజీ హీరోగా మారాడు. ఆయన ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో AA22 అనే ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో బన్నీ సినిమా చేయబోతున్నాడు. అయితే, రెమ్యునరేషన్ విషయంలో ఇండియాలోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు ఈ స్టార్ హీరో.
‘పుష్ప-2’ చిత్రం కోసం అల్లు అర్జున్ సినిమాకు జరిగిన టోటల్ బిజినెస్‌లో 27 శాతం వాటా తీసుకున్నాడు. ఇక ఆ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల మేర బిజినెస్ జరగడంతో బన్నీ రూ.270 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాలకు కూడా ఇదే విధంగా 27-30 శాతం బిజినెస్‌లో వాటాను తన రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడట.
ఇలా ఓ సినిమాకు జరిగే బిజినెస్ నుంచి వాటా తీసుకోవడం ఇండియన్ సినిమాలో బన్నీతో మొదలైందని చెప్పాలి. మొత్తానికి అల్లు అర్జున్ రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా వావ్ అనిపిస్తున్నాడు.


