రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్‌పై క్రేజీ న్యూస్.. షూటింగ్ స్టార్ట్..?

రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్‌పై క్రేజీ న్యూస్.. షూటింగ్ స్టార్ట్..?

Published on Feb 7, 2026 3:00 PM IST

Rajinikanth Kamal Hassan

తమిళ సినిమాలోని లెజెండరీ యాక్టర్స్ రజినీకాంత్ మరియు కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత కలిసి నటిస్తుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘జైలర్’ చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే, ఈ స్టార్ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారని.. ఒక చిన్న వీడియో షూటింగ్ శనివారం రోజు మొదలైందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ కెమెరామెన్ రాజీవ్ మీనన్ ఈ షూటింగ్‌ను హ్యాండిల్ చేస్తున్నారట. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఈ వీడియోలో డైరెక్టర్ నెల్సన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇద్దరూ హీరోలకు మేకప్ వేసే వ్యక్తులుగా కనిపించబోతున్నారట.

చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ మరియు రాజ్ కమల్ ఫిల్మ్స్ కలిసి ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు