‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సీక్వెల్ వార్తలపై మేకర్స్ క్లారిటీ

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సీక్వెల్ వార్తలపై మేకర్స్ క్లారిటీ

Published on Feb 7, 2026 5:08 PM IST

agent sai srinivasa athreya

ట్యాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్‌లో నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా సీక్వెల్ గురించి ఎలాంటి అధికారిక సమాచారమైనా కేవలం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లేదా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

ఈ ఫ్రాంచైజీ లేదా రాబోయే సినిమాల గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అలాగే వాటిని ప్రచారం చేయవద్దని చిత్ర యూనిట్ అభిమానులను మరియు ప్రేక్షకులను కోరింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేదని, ఏదైనా అప్‌డేట్ ఉంటే నేరుగా సంస్థ నుండే వస్తుందని వారు వెల్లడించారు.

నవీన్ పొలిశెట్టి, శ్రుతి శర్మ, సుహాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్వరూప్ ఆర్.ఎస్.జె డైరెక్ట్ చేశారు. 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు