యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా పరిచయమవుతుండగా, నిరంజన్ హీరోగా నటిస్తున్నారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
హీరో హీరోయిన్ల మధ్య సాగే రోడ్ జర్నీ, వారి మధ్య చిగురించే ప్రేమకథను ట్రైలర్లో ఆవిష్కరించారు. విజువల్స్, జంట మధ్య కెమిస్ట్రీ ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇక దర్శకుడు అర్జున్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, ఆయన మేనల్లుడు ‘యాక్షన్ ప్రిన్స్’ ధ్రువ సర్జా పవర్‌ఫుల్ క్యామియోతో అలరించనున్నారు.
లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ యాక్షన్ అంశాలు కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనిని తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం పేర్కొంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


