‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?

‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?

Published on Feb 10, 2026 10:00 AM IST

Rowdy-Janardhana

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’(‘Rowdy Janardhana). ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ను రవి కిరణ్‌ కోలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ను అప్రోచ్ అవుతారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు