యష్ ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ పూర్తి.. ఆ ఒక్క భాషలో తప్ప

యష్ ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ పూర్తి.. ఆ ఒక్క భాషలో తప్ప

Published on Feb 10, 2026 7:31 PM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే ‘టాక్సిక్'(Toxic). కేవలం కన్నడ లోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా ఏకకాలంలో తెరకెక్కించిన ఈ అవైటెడ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో ఇంగ్లీష్ లో కూడా భారీ రిలీజ్ కి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా తాలూకా ఓవర్సీస్ డీల్ ని పూర్తి చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఓవర్సీస్ లో పాన్ ఇండియా భాషల్లో డీల్ ని ఫార్స్ ఫిల్మ్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు కానీ ఈ ఓవర్సీస్ మార్కెట్ లో ఇంగ్లీష్ రిలీజ్ ని వీరు చేయడం లేదట.

మరి ఇంగ్లీష్ రిలీజ్ అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకం గానే మిగిలింది. సో ఈ సినిమా ఇంగ్లీష్ రిలీజ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా యష్, కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

Toxic 1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు