లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఘట్టమనేని వారసుడు ఘట్టమైనేని జై కృష్ణ హీరోగా పరిచయం అయ్యిన సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ కూడా ఒకటి. డీసెంట్ బజ్ నడుమ విడుదల అయ్యిన ఈ సినిమాకి ఘట్టమనేని అభిమానులు మంచి రెస్పాన్స్ అందించారు. అయితే ఈ సినిమాకి అందించిన రెస్పాన్స్ పై ఘట్టమనేని జై కృష్ణ ఆనందం వ్యక్తం చేస్తూ తన అనుభూతి షేర్ చేసుకున్నాడు.
తనకి మంచి వెల్కమ్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ కి అలాగే మొదటి నుంచీ తమకి అండగా ఉన్న ఘట్టమనేని అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సినిమా చూసినవారు అంతా తనని అభినందించడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అని ముఖ్యంగా తన యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో పెర్ఫామెన్స్ ని అంతా మెచ్చుకుంటున్నారు అని ఈ వారాంతంలో మీకు ఫ్రీ టైం ఉంటే చూడాల్సిందిగా కోరాడు.
దీనితో ఈ వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా పి కిరణ్ నిర్మాణం వహించారు. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో ఈ చిత్రం విడుదలకి వచ్చింది.
A heartfelt thanks to everyone for your love and support ❤️#JaiKrishnaGhattamaneni thanks everyone for the immense appreciation showered on #SrinivasaMangapuram ❤️🔥
Experience the MOST INTENSE LOVE STORY OF THE SEASON in cinemas now 🔥
🎟️ https://t.co/DOJMW5xdr2… pic.twitter.com/6ocCY7KapO
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 1, 2026


