తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర దృవ తారాల్లాంటి దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. తెలుగు సినిమా ఉన్నన్ని నాళ్ళు వినిపించే సుస్థిరమైన పేర్లలో ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి తన పేరును తన ‘స్వయంకృషి’తో అభిమానులకి ‘అన్నయ్య’గా నిలిచిపోయే విధంగా సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.
అయితే ఏ హీరో గాని నటుడు కానీ తన మొదటి సినిమా, సినిమా కెమెరా ముందు మొదటి పెర్ఫామెన్స్ లు ఎంతో ప్రత్యేకం. అలానే మెగాస్టార్ చిరంజీవికి అప్పటికి తెలియకపోవచ్చు కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అనే నేను ఒకరోజున తెలుగు తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఏలుతాను అని.. తన మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన రోజు. మరి ఇప్పుడు మెగాస్టార్ అదే రోజుని సోషల్ మీడియాలో ఎంతో ప్రత్యేకంగా పంచుకున్నారు.
తన సినీ ప్రస్థానానికి పునాదిగా నిలిచిన మొదటి సినిమా ‘పునాదిరాళ్లు’ నుంచి తన అనుభవాన్ని పంచుకున్నారు. సరిగ్గా నేడు ఫిబ్రవరి 11నే తాను తన మొదటి సినిమాకి కెమెరా ముందుకు వచ్చిన రోజు అని పలు ఫోటోలు తాను షేర్ చేసుకొని మురిసిపోయారు. నిన్ననే జరిగిందా అనే రకమైన అనుభూతి అదంతా ఒక అందమైన చందమామ కథ లాంటిది నాకు అని ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. దీనితో తన పోస్ట్ మరియు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులలో వైరల్ గా మారాయి.


