పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న అవైటెడ్ మాస్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి లాంగ్ రన్ సినిమా అందిస్తారని చాలామంది భావిస్తున్నారు. ఇక ఈ సినిమా పనులు అన్నీ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ చిత్రంలో విలన్ గా నటించిన నటుడు పార్తిబన్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇక లేటెస్ట్ గా ఈ టాలెంటెడ్ నటుడు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం సొంతంగా తన డబ్బింగ్ తానే చెప్పుకున్నట్టు తెలిపారు. ఇది వరకు తన తమిళ సినిమాలకి ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ లతో తనకి తగ్గట్టుగా చెప్పించారు. మరి ఇదే తన నుంచి మొదటిసారి తెలుగు డబ్బింగ్ కూడా సో ఈ ప్రయోగం తెలుగు ఆడియెన్స్ లో కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, హీరోయిన్ శ్రీలీల నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
Director Harish Shankar sir,
Left-ல இருக்கிறதுதான் right -டான Parthiban.Not A I. Uncle age-ல இருக்குற நடிகர்கள் கூட, ஆண்ட்டி ஏஜிங் பண்ணி வயசை குறைச்சிக்கிற இந்த கலிகாலத்தில….. வளரும் (தெலுங்கில்) நடிகனான எனக்கு ஓவரா மேக்-அப்பி ஒரு வயசானவனா காட்ட நீங்க முயற்சி பண்றீங்களோன்னு… pic.twitter.com/Whc7FvOFhC— Radhakrishnan Parthiban (@rparthiepan) February 11, 2026


