ఫోటో మూమెంట్ : మెగా ట్విన్స్‌కు నామకరణం.. పేర్ల వెనుక ఉన్న అర్థాలను వెల్లడించిన చిరంజీవి..!

ఫోటో మూమెంట్ : మెగా ట్విన్స్‌కు నామకరణం.. పేర్ల వెనుక ఉన్న అర్థాలను వెల్లడించిన చిరంజీవి..!

Published on Feb 13, 2026 3:24 PM IST

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనల కవల పిల్లల నామకరణ వేడుకకు సంబంధించిన విశేషాలను అధికారికంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బారసాల వేడుకలో తీసిన ఒక అందమైన ఫోటోను ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులు, క్లిన్ కారాతో పాటు నవజాత శిశువులు ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నారు.

ఈ వేడుకలో బాబుకు ‘శివ రామ్ కొణిదెల’ అని, పాపకు ‘అన్వీర దేవి కొణిదెల’ అని నామకరణం చేసినట్లు మెగాస్టార్ ప్రకటించారు. ఈ పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థాలను కూడా ఆయన వివరించారు. తన అసలు పేరు శివశంకర వరప్రసాద్ మరియు కుమారుడు రామ్ చరణ్ పేర్ల కలయికతో ‘శివ రామ్’ అనే పేరును నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పేరు ఆధ్యాత్మిక బలానికి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అలాగే పాప పేరు ‘అన్వీర దేవి’ సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ నుంచి ప్రేరణ పొంది పెట్టినట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ పేరు దైవిక శక్తిని, ధైర్యాన్ని మరియు రక్షణను సూచిస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు