విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఐశ్వర్య అర్జున్, నిరంజన్, అర్జున్ సార్జా, ధృవ్ సార్జా, ప్రకాష్ రాజ్, సత్యరాజ్ తదితరులు
దర్శకుడు : అర్జున్ సార్జా
నిర్మాత: అర్జున్ సార్జా
సంగీతం : అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం : జి బాలమురుగన్
కూర్పు : ఆయూబ్ ఖాన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా దర్శకునిగా తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ వాలెంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
Seetha Payanam కథ:
తన జీవితంలో పెళ్లి మీద పెద్ద ఆసక్తి లేని సీత (ఐశ్వర్య) ఓ ఫేమస్ చెఫ్ హైదరాబాద్ లో ఇస్తున్న ప్రెజెంటేషన్ కోసం చూసేందుకు కార్ ప్రయాణంలో బయలుదేరుతుంది. ఈ పయనంలో తనతో పాటుగా అభిషేక్ (నిరంజన్) అనే స్ట్రేంజర్ కూడా భాగం అవుతాడు. మరి అతను ఎందుకు తన తోనే జర్నీ చేయాల్సి వచ్చింది. ఈ జర్నీ లో సీత ఎందుకు తనకి మధ్యలో పరిచయం అయ్యిన వారు అందరికీ వెతికి మరీ థాంక్స్ చెప్పాలనుకుంటుంది. ఈ మధ్యలో పరిచయం అయ్యిన ఓ రౌడి గిరి (అర్జున్ సార్జా), పవన్ (ధృవ్ సార్జా) ల పాత్రలు ఏంటి? చివరికి పెళ్లి విషయంలో ఐశ్వర్య మనసు మారిందా లేదా అనేవి తెలియాలి ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
నటీనటులలో ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాలో తన వల్ల కుదిరిన అన్ని అంశాలలో తన టాలెంట్ చూపించింది. డాన్స్, నటన, గ్లామర్ ఇలా పలు కోణాల్లో ఐశ్వర్య అర్జున్ తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం ఇందులో చేసింది.
అలాగే లీడ్ నటుడు నిరంజన్ కూడా ఈ సినిమాలో డీసెంట్ పెర్ఫార్మన్స్ చేసాడు. యాక్షన్ బ్లాక్స్ తనపై పర్వాలేదు. ఇక అర్జున్ సార్జా కామియో కూడా పర్వాలేదు. తన రోల్ ని అర్జున్ బాగా చేశారు. వీరితో పాటుగా ప్రకాష్ రాజ్, సత్య రాజ్ లు తమ పాత్రల్లో పరిధి మేరకు బాగా నటించారు. అలానే ఫస్టాఫ్ లో హీరోయిన్ పాత్రపై చూపించిన 20 సెకండ్ల లైఫ్ కాన్సెప్ట్ డీసెంట్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఒక సమయం తర్వాత ఈ కాన్సెప్ట్ ఏదో కొంచెం పర్వాలేదు అనే మూమెంట్ తర్వాత నుంచి కొంచెం కథనంపై ఆశలు చిగురిస్తాయి. కానీ అర్జున్ ఆ కథనాన్ని ఎంగేజింగ్ గా నడిపించడంలో విఫలం అయ్యారని చెప్పక తప్పదు. అప్పటికే బిలో యావరేజ్ గా అనిపించే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ లో మంచి మూమెంట్స్ తో సినిమాని తీసుకెళ్లే స్కోప్ ఉంది.
కానీ సెకండాఫ్ మొత్తం చాలా బోరింగ్ గా సాగదీతగా వెళుతుంది. పోని పాటలతో అయినా సినిమా ముందుకు వెళుతుందా అంటే అవి మరింత నీరసం తీసుకొస్తాయి. సెకండాఫ్ లో ధృవ్ సార్జా కామియో ఓవర్ గా అనిపిస్తుంది. అంత బిల్డప్ అవసరం లేదు. దాదాపు సినిమాలో ఏ ఎమోషన్ కూడా ఆడియెన్స్ కి కనెక్ట్ కాకుండానే కనిపిస్తుంది. వీటితో ఆడియెన్స్ ఎమోషనల్ గా కూడా ఎక్కడా కనెక్ట్ కాలేరు.
నిజానికి ఈ సినిమాలో అర్జున్ ఎంచుకున్న కాన్సెప్ట్ కి మంచి ఫీల్ గుడ్ కథనం ప్లాన్ చేసుకోవాల్సింది. తన ప్రాణం కాపాడడానికి కారణం అయ్యిన వారిని కలిసే ప్రక్రియని ఒకొక్కటిగా బెటర్ బ్లాక్ లతో డిజైన్ చేసి ఉంటే సెకండాఫ్ కథనం బాగుండేది. పైగా హీరోయిన్ కి ఉన్న సమస్య కోసం హీరోనే స్వయంగా రంగంలోకి దిగడం మళ్లీ అందులో వారి లవ్ ట్రాక్ లు అంత సహజంగా అనిపించవు. వీటితో కథనం అలా బోర్ గానే సాగుతుంది.
ఇక ఇవే కాకుండా సినిమాలో నిర్మాణ విలువలు కూడా బాలేవు. ఏ ఐ తో కూడిన కొన్ని సన్నివేశాలు దారుణంగా అనిపిస్తాయి. చూసే ఆడియెన్స్ ని మరీ ఇంత గ్రాంటెడ్ గా తీసుకుంటారా అనిపిస్తుంది. చాలా వరకు సన్నివేశాల్లో ఇదే తంతు. మరి అర్జున్ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారో తనకే తెలియాలి.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బిలో యావరేజ్ గా ఉన్నాయి. వి ఎఫ్ ఎక్స్ కంటే చీప్ క్వాలిటీతో కూడిన ఏ ఐ విజువల్స్ ని ఆడియెన్స్ కి అందించారు. అనూప్ రూబెన్స్ పాటలు కొన్ని పర్వాలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలేదు. తన పాత సినిమాల నుంచే అటు తిప్పి ఇటు తిప్పి కొట్టినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ లో కొన్ని ట్రాన్సిక్షన్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు తగ్గించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది.
ఇక దర్శకుడు అర్జున్ సార్జా విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకి మెప్పించదు. మంచి లైన్ నే తీసుకున్నారు కానీ దానికి కావాల్సిన మంచి కథనం, సన్నివేశాలు తను డిజైన్ చేసుకోలేదు. చాలా బోరింగ్ గా సినిమాని తను నడిపించి విసుగు తెప్పించారు. ఇంకా బెటర్ గా ఏమన్నా తన కూతురు డెబ్యూ కోసం ట్రై చేయాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘సీతా పయనం’ లో అర్జున్ ఎంచుకున్న లైన్ ఓకే అనిపిస్తుంది అలాగే తన కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా డీసెంట్ లుక్స్ తో మంచి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో కనబరిచింది. కానీ కథనం మాత్రం అర్జున్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. కావాల్సిన ఎమోషనల్ డెప్త్ ఈ చిత్రంలో బాగా మిస్ అయ్యింది. వీటితో ఈ సీతా పయనం స్లోగా సాగుతుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


