వాలెంటైన్స్ డే వీకెండ్లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మూడు చిత్రాలు రిలీజయ్యాయి. అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ మిక్సిడ్ టాక్‌ను తెచ్చుకున్నాయి. కానీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే ప్రేమకథా చిత్రం మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్షన్లో ఈ సినిమా వచ్చింది.
ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ చిత్ర సక్సెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీతో తాము మరో లవ్ స్టోరీ చేస్తామని.. ఈ సినిమాను వచ్చే ఏడాది వాలెంటైన్స్‌కు రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు. ఇక ఈ ప్రకటనతో ప్రేక్షకుల్లో మరోసారి ఈ జోడీపై ఆసక్తి క్రియేట్ అయ్యింది.
కాగా, ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది మాత్రం ధీరజ్ వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్‌తో కలిసి తాను ప్రొడ్యూస్ చేస్తానని తెలిపారు.


