మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు వేడుకలు కూడా సెట్స్ లోనే జరిపారు.
ఇక ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న శివ రాజ్ కుమార్ బుచ్చిబాబు సానాకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీనితో తమ ఇద్దరి పిక్ ని కలిపి దర్శకుడు బుచ్చిబాబు సానా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో ఈ పిక్ మంచి ఫోటో మూమెంట్ గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.
Thank you so much for the lovely gift @NimmaShivanna Sir ❤️❤️🤗🤗
It truly means a lot Sirrr. Love U Sirrr❤️❤️ pic.twitter.com/0YnhB48okh
— BuchiBabuSana (@BuchiBabuSana) February 17, 2026


