మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా వెంకీ మామ కీలక పాత్రలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
ఇక థియేటర్స్ నుంచి ఇటీవల ఓటిటిలోకి కూడా వచ్చిన ఈ సినిమా అక్కడా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ కొల్లగొట్టింది. మరి ఓటిటి తర్వాత ఫైనల్ గా బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మొదటి టెలికాస్ట్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులతో పాటుగా శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థ వారే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు జీ తెలుగు వారు ఈ ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 కి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు.


