ఆరా ఆఫ్ ‘ఉస్తాద్’ రిలీజ్ కి టైం ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ!

ఆరా ఆఫ్ ‘ఉస్తాద్’ రిలీజ్ కి టైం ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ!

Published on Feb 21, 2026 6:56 PM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో మంచి బజ్ నెలకొంది. ఇక ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ సోషల్ మీడియాని ఇప్పుడు రూల్ చేస్తుండగా నెక్స్ట్ సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్ ని మేకర్స్ రేపు ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ లో మధ్యాహ్నం మూడున్నర సమయం నుంచే ఈవెంట్ స్టార్ట్ చేసి సాంగ్ ని అక్కడ లాంచ్ చేస్తుండగా ఆన్లైన్ రిలీజ్ పై మేకర్స్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. యూట్యూబ్ తదితర ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లలో ఈ సాంగ్ ని సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకి అందిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో దేవిశ్రీ ప్రసాద్ ఈసారి ఎలాంటి ఫీస్ట్ ని సిద్ధం చేసారో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ మార్చ్ 26న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు