పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఐతే, దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఐతే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఆసక్తికరమైన వార్తలతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిందని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుందని.. శంకర్‌పల్లిలో నిర్మించిన సెట్‌లో అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ పాత్రల పై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మొదట దీపిక పదుకోణే హీరోయిన్ గా నటించింది. ఐతే, ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. మరి ఇప్పుడు ఆమె స్థానంలో ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో చూడాలి. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.


