పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ యాక్షన్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. అభిమానుల్లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఎట్టకేలకి అంతా ఎదురు చూస్తున్న రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ బయటకి వచ్చేసింది. హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో అట్టహాసంగా విడుదల అయ్యిన ఈ సాంగ్ మాత్రం ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.
ఆస్కార్ విజేత చంద్రబోస్ పదునైన సాహిత్యానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన మాస్ బీట్స్ తో పవన్ అభిమానులకి కిక్ ఇచ్చే లెవెల్లో దుమ్ము లేపారు. అలాగే పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే విధంగా డిజైన్ చేసుకున్న సాంగ్ కి దేవి తన మ్యూజిక్ తో మరింత ప్రాణం పోశారు. మొత్తానికి ఈ సాంగ్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇక బిగ్ స్క్రీన్స్ పై ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


