VIROSH : విజయ్ – రష్మిక పెళ్లి పై ఆఫీషియల్ ప్రకటన.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!

VIROSH : విజయ్ – రష్మిక పెళ్లి పై ఆఫీషియల్ ప్రకటన.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!

Published on Feb 23, 2026 9:00 AM IST

VIROSH

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ మధుర క్షణం రానే వచ్చింది. ఈ క్రేజీ స్టార్ జంట తమ పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించి అభిమానులను ఖుషీ చేశారు. తమ జంటకు ఫ్యాన్స్ పెట్టిన ముద్దుపేరు “విరోష్” (VIROSH) పేరుతోనే ఈ వివాహ వేడుక జరగనుండటం విశేషం. సోషల్ మీడియా వేదికగా వారు ఈ విషయాన్ని వెల్లడించడమే కాకుండా, వివాహం కోసం ఈరోజు ఉదయమే హైదరాబాద్ నుండి ఉదయ్‌పూర్ పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

​రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రేపటి నుండి వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాన కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి 26, 2026న జరగనుంది. అత్యంత సన్నిహితులు మరియు కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించనున్నారు. పెళ్లి అనంతరం టాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానుల కోసం మార్చి 4, 2026న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

​గీత గోవిందం (2018) సినిమాతో తొలిసారి వెండితెరపై మెరిసిన ఈ జంట, ఆ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో కూడా తమ కెమిస్ట్రీతో అలరించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్న ‘రణబాలి’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది. వెండితెర జంటగా మెప్పించిన వీరు, ఇప్పుడు నిజ జీవిత భాగస్వాములుగా మారబోతుండటంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు