విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి సందడి: ఉదయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటున్న అతిథులు

విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి సందడి: ఉదయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటున్న అతిథులు

Published on Feb 24, 2026 1:11 PM IST

Vijay Deverakonda-Rashmika's Royal Wedding

  • టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం టాలీవుడ్ ప్రముఖులు ఉదయ్‌పూర్ చేరుకుంటున్నారు.
  • తాజాగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో లగేజ్‌తో కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
  • విజయ్ దేవరకొండకు ‘పెళ్లి చూపులు’ సినిమాతో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ వేడుకకు హాజరుకావడం అభిమానుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్ (Vijay Deverakonda – Rashmika Mandanna Wedding) కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ముస్తాబైంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు అక్కడకు చేరుకోగా, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అత్యంత సన్నిహితులు క్యూ కడుతున్నారు. తాజాగా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, తెలుగమ్మాయి.. హీరోయిన్ ఈషా రెబ్బా, ప్రముఖ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మలు ల్యాండ్ అయ్యారు. వీరు తమ లగేజ్ బ్యాగులతో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

విజయ్ దేవరకొండ ఈరోజు పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నాడంటే దానికి పునాది వేసింది కచ్చితంగా తరుణ్ భాస్కరే. 2016లో తరుణ్ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ సినిమానే విజయ్‌కి హీరోగా తొలి బ్రేక్ ఇచ్చింది. తన కెరీర్ టర్నింగ్ పాయింట్‌కి కారణమైన దర్శకుడు ఇప్పుడు తన పెళ్లికి రావడం విజయ్-తరుణ్‌ల బాండింగ్‌ను తెలియజేస్తుంది. ఇక శ్రావ్య వర్మ టాలీవుడ్‌లో టాప్ సెలబ్రిటీలకు స్టైలిస్ట్‌గా వర్క్ చేయడమే కాకుండా ‘గుడ్ లక్ సఖి’ చిత్రంతో నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఈషా రెబ్బాతో కలిసి ఒకేసారి ఉదయ్‌పూర్ ల్యాండ్ అవ్వడంతో పెళ్లి సందడి అమాంతం పెరిగింది.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మల రాకతో టాలీవుడ్ నుంచి ఇంకెవరెవరు ఈ రాయల్ వెడ్డింగ్‌కి హాజరుకానున్నారు అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మరికొన్ని గంటల్లో మరింత మంది స్టార్స్ ఎయిర్‌పోర్ట్ విజువల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఫోటోల కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు.

తాజా వార్తలు