గత కొన్నాళ్ల కితం బాలీవుడ్ దగ్గర సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ది కాశ్మీర్ ఫైల్స్ ఇంకా కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సంచలన విజయం సాధించిన కేరళ స్టోరీ కి సీక్వెల్ అంటూ ది కేరళ స్టోరీ 2 రీసెంట్ గా ట్రైలర్ తో వివాదాలకు దారి తీసింది. ఇక ఈ ట్రైలర్ వచ్చాక దేశ వ్యాప్తంగా మేకర్స్ కి మంచి మైలేజ్ కూడా దక్కింది.
ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ చూసాక అసలు ఇది కేరళ స్టోరీ నే కాదు అని అంటున్నారు. గత పార్ట్ లో కేరళ నేపథ్యంలోనే సన్నివేశాలు, కథాంశం చూపించారు. కానీ పార్ట్ 2 ఇదంతా దక్షిణ భారతదేశంలో జరిగిన కథగా చూపించారు. దీనితో అసలు కేరళకి ఈ సినిమాకి సంబంధం ఏంటి అనేది చాలా మంది ప్రశ్న.
కానీ మేకర్స్ ఏం చెబుతున్నారంటే తమ సినిమాలో జరిగిందే చెబుతున్నామని నిజ జీవితంలో లవ్ జీహాద్ బారిన పడి బయటకి వచ్చిన వారి కథనే తాము చెబుతున్నట్టు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. దీనితో వాస్తవంగా జరిగిన విషయాలు వదిలేసి టైటిల్ ఒకటి పెట్టి ఇంకో చోట జరిగిన స్టోరీ చెబుతున్నారు అంటూ పలు కామెంట్స్ ఇప్పుడు మొదలయ్యాయి.
మరి మేకర్స్ కూడా తాము తీసుకున్న కాన్సెప్ట్ కేరళ స్టోరీకి సంబంధించిందే పైగా నిర్మాత కూడా ఒకరే కావడంతో ఇలా ముందుకు వచ్చింది. సో టైటిల్ ఏదైనా కాన్సెప్ట్ ఒకటే అని అసలు విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు.


