‘ధురంధర్ 2’ షాకింగ్ రన్ టైం లీక్?

‘ధురంధర్ 2’ షాకింగ్ రన్ టైం లీక్?

Published on Feb 28, 2026 5:32 PM IST

Dhurandhar 2

ఇప్పుడు ఒక్క బాలీవుడ్ సినిమా మాత్రమే కాకుండా మొత్తం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ బాలీవుడ్ సీక్వెల్ చిత్రమే “ధురంధర్ 2” (Dhurandhar 2). భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమాని ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా మొదటి పార్ట్ కే షాకింగ్ రన్ టైం వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ థియేటర్స్ లో ఆడియెన్స్ కూర్చిని చూసారు. ఇక పార్ట్ 2 కూడా అంతే లెంగ్త్ తో ఉంటుంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ ఒక పది నిమిషాలు తక్కువ ఉంటుందని వినిపించింది.

కానీ ఫ్రెష్ లీక్ ఏంటంటే తక్కువ కాదు ఎక్కువ నిడివి తోనే ఈ సినిమా వస్తుందట. ఈసారి ఏకంగా 3 గంటల 40 నిమిషాల పాటు సినిమా ఉంటుందని ఓ రన్ టైం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి జియో స్టూడియోస్ నిర్మాణం వహించగా ఈ మార్చ్ 19న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదలకి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు