అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “వృషకర్మ”. సాలిడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా భారీ స్కేల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్చ్ 5న దీనిని విడుదల చేస్తునట్టు ఖరారు చేయగా ఇప్పుడు ఈ గ్లింప్స్ రిలీజ్ కి రంగం సిద్ధం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద స్క్రీన్ పై ఈ గ్లింప్స్ పడనుంది. అందుకు వీరు హైదరాబాద్ లోని ప్రసాద్స్ పి సి ఎక్స్ స్క్రీన్ ని ఎంచుకోగా అందులో ఈ మార్చ్ 5 ఉదయం 10 గంటలకి స్క్రీనింగ్ చేస్తున్నట్టు ఖరారు చేశారు. ఇక ఈ ఈవెంట్ లో అభిమానులు సహా మీడియా వారు కూడా హాజరు కానున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా గత విరూపాక్ష నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.


