‘విశ్వంభర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనా? బిగ్ స్క్రీన్స్ పై డబుల్ బ్లాస్ట్?

‘విశ్వంభర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనా? బిగ్ స్క్రీన్స్ పై డబుల్ బ్లాస్ట్?

Published on Mar 3, 2026 5:09 PM IST

vishwambhara

ఈ ఏడాదిలో ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్ గా “మన శంకర వరప్రసాద్ గారు” తో వచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తన నుంచి ఈ ఏడాదిలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రమే “విశ్వంభర”. భారీ ఫాంటసీ చిత్రంగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే మేకర్స్ ఈ సినిమాని గ్రాండ్ ఎలిమెంట్స్ తో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు కానీ మధ్యలో నెలకొన్న జాప్యం సినిమాపై అంచనాలు క్షీణించేలా చేస్తుంది. అయితే ఫైనల్ గా విశ్వంభర థియేట్రికల్ ట్రైలర్ పై సాలిడ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం విశ్వంభర ట్రైలర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ “పెద్ది” తో థియేటర్స్ లో పడనుంది అని తెలుస్తుంది.

అంటే ఈ ఏప్రిల్ 30న థియేటర్స్ లో పెద్ది తో పాటుగా విశ్వంభర ట్రైలర్ ట్రీట్ తో మెగా అభిమానులకి డబుల్ బ్లాస్ట్ గా నిలవనుంది అని చెప్పవచ్చు. ఇక దీనిపై మరింత క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. మెగాస్టార్ ఫాంటసీ జానర్ సినిమాలకి మంచి ఆదరణ ఉంది. విశ్వంభర కూడా మినిమమ్ టాక్ తెచ్చుకున్నా భారీ వసూళ్లు సెట్ చేయొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు