వరలక్ష్మీ శరత్‌కుమార్ తన కెరీర్లో ఇప్పటివరకు అద్భుతమైన నటనతో మెప్పించి ఇప్పుడు ‘సరస్వతి’ చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టింది. తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ‘దోస డైరీస్’ బ్యానర్‌పై ఆమె ఈ చిత్రాన్ని నిర్మించింది. నటిగా మాత్రమే కాకుండా, దర్శకురాలిగా మరియు నిర్మాతగా తన ప్రతిభను చాటుకోవడానికి వరలక్ష్మి సిద్ధమైంది.
సెన్సార్ బోర్డ్ నిబంధనల ప్రకారం ఇటీవల పలు చిత్రాల పేర్లు మారిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ‘సరస్వతి’ టైటిల్లో కూడా మార్పు చోటుచేసుకుంది. ఈ చిత్రాన్ని ఇకపై ‘ఎస్.సరస్వతి’ అని పిలవాలని సెన్సార్ బోర్డు సూచించడంతో చిత్ర యూనిట్ ఆ పేరును ఖరారు చేసింది. గతంలో ‘హే భగవాన్’, ‘చాయ్ వాలా’ వంటి సినిమాలు కూడా ఇలాగే తమ పేర్లను మార్చుకున్నాయి.
హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా 2 గంటల 1 నిమిషం నిడివితో చాలా క్రిస్ప్‌గా ఉండబోతోంది. ఇందులో ప్రకాష్ రాజ్, ప్రియమణి మరియు నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.


