టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు భారీ సినిమా దర్శకుడు అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఇంట తన సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా అంతా ఆ సందడిలో ఉన్నారు. కానీ ఇదే సమయంలో ఐకాన్ స్టార్ పై ఒక ఊహించని వార్త సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. అల్లు అర్జున్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
అందులో ఇప్పుడు మరొకటి చేరింది. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కోసం అల్లు అర్జున్ తన ఆర్ధిక అండ అందించినట్టు తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా శ్యామల అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇది ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలుసు. అయితే అల్లు అర్జున్ వద్దకి ఈ విషయం రాగా తాను ఆమె కుటుంబానికి ప్రతీ నెల 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు బయటకి వచ్చింది. దీనితో అల్లు అర్జున్ మరోసారి తన ఉదారతని చాటుకున్నారని చెప్పొచ్చు.


