మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రై రై రా రా’ పాటలు ఏఆర్ రెహ్మాన్ మార్క్ మ్యూజిక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ పై పడింది. ఈ పాట కోసం మేకర్స్ మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించారని, అయితే ఆమె ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.
గతంలో ఈ ప్రాజెక్ట్‌లో తన భాగస్వామ్యంపై స్పందించిన మృణాల్, చరణ్ సినిమాలో నటించడం తనకు దక్కే గొప్ప గౌరవమని పేర్కొంది. ‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా, ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.


