పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమైంది. ఈ ఏడాది ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే.. దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రంగంలోకి దిగాడు. ఇక ఈ సినిమా ఇంపాక్ట్‌ను మరింత పెంచేందుకు థమన్ తనదైన శైలిలో వర్క్ చేస్తున్నారని దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించేందుకు చిత్ర బృందం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది.
మార్చి 19న విడుదల విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని, అన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని హరీష్ శంకర్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ‘మీరు కోరుకుంటున్న అప్డేట్స్ అన్నీ త్వరలోనే వస్తాయి, ప్రస్తుతం మాకు మీ మద్దతు కావాలి’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఉస్తాద్ పై హరీష్ శంకర్ కాన్ఫిడెన్స్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి.


