ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘నవాబ్స్ కేఫ్’.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడు అంటే..?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘నవాబ్స్ కేఫ్’.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడు అంటే..?

Published on Mar 6, 2026 9:05 PM IST

Nwab cafe

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన యూత్‌ఫుల్ డ్రామా ‘నవాబ్స్ కేఫ్’ రిలీజ్‌కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’లో మార్చి 12వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ప్రమోద్ హర్ష ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పాతబస్తీలోని ఒక పురాతన కేఫ్‌ను దేవాలయంగా భావించే తండ్రి.. ఆ కేఫ్‌ను అమ్మేసి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే కొడుకు మధ్య సాగే ఘర్షణే ఈ సినిమా కథ.

ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరి ఈ ‘నవాబ్స్ కేఫ్’ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు