ఆ ఒక్క విషయం మినహా ఉస్తాద్ ఊచకోత ఖాయం..!

ఆ ఒక్క విషయం మినహా ఉస్తాద్ ఊచకోత ఖాయం..!

Published on Mar 7, 2026 9:00 AM IST

Ustaad Bhagat Singh

మార్చి 19న సోలో రిలీజ్ ఉంటుందని ఆశించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ చిత్ర బృందం షాక్ ఇచ్చింది. నేడు(మార్చి 7) ట్రైలర్ లాంచ్ చేయడమే కాకుండా, విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి పోటీ తప్పనిసరి అయింది. తెలుగు రాష్ట్రాల్లో వేరే పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ పరంగా పవన్ సినిమాకు డోకా లేకపోయినా, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ధురంధర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

​అయితే, ఈ పోటీలో ఒక కీలక అంశం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవేళ ఉస్తాద్ నిర్మాతలు టికెట్ ధరలు పెంచితే, అది పరోక్షంగా ధురంధర్ 2కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ, మాస్ ఆడియన్స్ మరియు ఫ్యామిలీస్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటం సానుకూలమైన విషయం. ఈ రెండు భారీ చిత్రాల మధ్య విజేత ఎవరో తేలాలంటే పబ్లిక్ టాక్ మరియు రివ్యూలే కీలకం కానున్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్.

​ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉండగా, దర్శకుడు హరీష్ శంకర్ ప్రమోషన్స్ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ‘ఓజి’ స్థాయిలో హైప్ లేకపోయినా, ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఒకవేళ ‘ధురంధర్ 2’కి ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అన్ని ప్రాంతాల్లో బాక్సాఫీస్ ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు