దీపిక ఎలాంటి డిమాండ్లు చేయలేదు – అనన్య పాండే

దీపిక ఎలాంటి డిమాండ్లు చేయలేదు – అనన్య పాండే

Published on Mar 8, 2026 12:56 AM IST

Ananya 1

హీరోయిన్ అనన్య పాండే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన వర్కింగ్‌ అవర్స్‌ అంశంపై తాజాగా కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. కరీనా కపూర్‌, కల్యాణి ప్రియదర్శన్‌లతో కలిసి ఆమె ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా’ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ లో వర్కింగ్‌ అవర్స్‌ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో అనన్య పాండే మాట్లాడుతూ.. ‘దీపికా పదుకొణె అంకితభావం ఉన్న నటి. నేను ఆమెతో కలిసి పని చేశాను. అప్పుడు దీపిక ఎలాంటి డిమాండ్లు చేయలేదు’ అని అనన్య పాండే మాట్లాడింది.

అనన్య పాండే ఇంకా మాట్లాడుతూ.. ‘దీపికా షూటింగ్‌ విషయంలో ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకు తల్లి. ఆ పాపకు కనీసం రెండేళ్లు అయినా పూర్తిగా దీపిక అవసరం ఉంటుంది. అందుకే, ఇప్పుడు ఇలాంటి డిమాండ్‌ చేశారు. ఇందులో తప్పేం లేదు. ఆమె డిమాండ్‌కు పూర్తి మద్దతు ఇస్తాను’ అని అనన్య పాండే తెలిపారు. ఇక కరీనా తల్లి అయిన తర్వాత ఇండస్ట్రీలో పాత ఆలోచనా ధోరణిని మార్చేశారని అనన్య చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు