బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బాక్సాఫీస్ బ్లాస్ట్ చిత్రమే ధురంధర్. ఇక దీనికి పార్ట్ 2 గా ధూరంధర్ 2 గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. మరి ఈ సీక్వెల్ పై హిందీ తర్వాత మన తెలుగు లోనే ఎక్కువ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్ట్ 1 చూసిన వారు మాత్రం ఖచ్చితంగా పాటలు మాత్రం హిందీ లోనే ఉంచేసి మిగతా అంతా తెలుగులో డబ్ చేస్తే చాలు అని కోరుకున్నారు.
పార్ట్ 1 పాటలు తెలుగు వెర్షన్ విన్నాక ఈ రిక్వెస్ట్ మరింత ఎక్కువ అయ్యింది. హిందీలో అప్పటికే చాలా సార్లు వినేయడంతో తెలుగులో అంతగా రుచించలేదు. దీనితో పార్ట్ కి మాత్రం పాటలు హిందీలోనే వదిలేసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ ట్రైలర్ లో కూడా హిందీ ట్రాక్స్ నే ఉంచేసారు. సో తెలుగు ఆడియెన్స్ రిక్వెస్ట్ ని మేకర్స్ అండర్ లైన్ చేసుకున్నారా అనుకోవచ్చు. మరి ఇది ట్రైలర్ వరకేనా లేక థియేటర్స్ లోకి వచ్చేసరికి మారుతుందా అనేది చూడాలి.


