ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ అంతా ఓ హిందీ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ధురంధర్ 2 కోసమే అని చెప్పాలి. ఓ బాలీవుడ్ సినిమా కోసం యావత్ భారతం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాగా చాలా ఏళ్ల తర్వాత ఇది నిలిచింది.
ఇక జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మార్చి 7న ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్‌ను విడుదల చేశాయి. ట్రైలర్ వెంటనే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
విడుదలైన కేవలం 48 గంటల్లోనే అంటే 2 రోజుల్లోనే ట్రైలర్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో 312 మిలియన్ల వ్యూస్ దాటింది, ఇది సినిమా చుట్టూ ఉన్న భారీ బజ్ ని హైలైట్ చేసింది. ఇది 45+ దేశాలలో యూట్యూబ్ చార్ట్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఇది గ్లోబల్ ఎట్రాక్షన్ ని ప్రజెంట్ చేస్తోంది అని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి అనే రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తూ కథలోని సంఘర్షణను మరింత ఇంటెన్స్ గా మలుస్తున్నారు.
సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా బలమైన నటీనటుల వున్నారు. ఆర్. మాధవన్ వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ అజయ్ సన్యాల్, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో విలన్‌గా, అలాగే సంజయ్ దత్ ఎస్‌పీ చౌధరి అస్లంగాపవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం అందించగా జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


