ఈ ఉగాది, ఈద్ పండుగల కానుకగా వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “ధురంధర్ 2” కూడా ఒకటి. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం పట్ల హైప్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. మరి ఈ హైప్ తోనే పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతున్న అన్ని చోట్ల సెన్సేషనల్ బుకింగ్స్ ని ఈ సినిమా చూస్తుంది.
ఇలా మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా అటు నార్త్ ఇండియాలో ఇంకా యూఎస్ మార్కెట్ లో కూడా ప్రీమియర్స్ కి భారీ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతున్నాయి. ఇండియాలో ఈ సినిమాకి ఆల్రెడీ 20 కోట్లకి దగ్గర ప్రీమియర్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా కేవలం నార్త్ అమెరికా నుంచే ఈ సినిమాకి 8 లక్షల డాలర్స్ వసూలు అయినట్టు తెలుస్తుంది. సో ఇలా ధురంధర్ హవా మాత్రం మామూలు లెవెల్లో లేదనే చెప్పవచ్చు.


