మరింత సాలిడ్ గా ‘పెద్ది’ ఎక్స్ పీరియెన్స్.. ఇది మంచి బూస్టప్!

మరింత సాలిడ్ గా ‘పెద్ది’ ఎక్స్ పీరియెన్స్.. ఇది మంచి బూస్టప్!

Published on Mar 12, 2026 4:30 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాని చిత్ర యూనిట్ అన్ని రకాలుగా కూడా ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు. మరి లేటెస్ట్ గా మేకర్స్ ఓ క్రేజీ అనౌన్సమెంట్ ని అయితే అందించారు.

పెద్ది చిత్రాన్ని డాల్బీ సినిమా వెర్షన్ లో కూడా విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. సో థియేటర్స్ లో మెయిన్ గా డాల్బీ స్క్రీన్స్ లో పెద్ది ఎక్స్ పీరియెన్స్ మరింత పీక్ లో అనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా ఈ టెక్నాలజీ బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. అందుకే మూవీ లవర్స్ కూడా ఈ వెర్షన్ ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. దీనితో మేకర్స్ కూడా ఈ ఇంట్రెస్టింగ్ మూవ్ తీసుకోవడం అనేది పెద్ది చిత్రానికి మంచి బూస్టప్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు